🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 1:31 pm Posted by : D RAMAKRISHNA

న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల సవరణలు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పునకు మెడ్‌సేవా హామీ

News Image

న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల సవరణలు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పునకు మెడ్‌సేవా హామీ


ఖమ్మం, నవంబర్ 24 (తెలంగాణ కెరటం ):
ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు దిలీప్ చౌదరి తాళ్లూరి, రంగారెడ్డి కోర్టుల న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శశికాంత్ మధుపు కలిసి న్యూఢిల్లీలోని మెడ్‌సేవా హెల్త్ ఇన్సూరెన్స్ TPA లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించి, తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తప్పుల సవరణలు తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మెడ్‌సేవా ఆపరేషన్స్ హెడ్, పిల్లల పేర్లను పాలసీ మధ్యంతర కాలంలో చేర్చుకోవచ్చని, జీవిత భాగస్వామి పేరును పాలసీ రెన్యువల్ సమయంలో చేర్చుకోవచ్చని హామీ ఇచ్చారు. పెండింగ్ దరఖాస్తులు, కార్డుల సవరణల పరిష్కారానికి మెడ్‌సేవా హైదరాబాద్ బ్రాంచ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా దిలీప్ చౌదరి తాళ్లూరి ఖమ్మంలోని స్తంభాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాలో చేర్చినందుకు మెడ్‌సేవా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
శశికాంత్ మధుపు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి సమర్పించిన పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ప్రయోజనాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఇరువురు కోరారు.
Additional News Photo
🏠 Home