పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా -పద్మశాలి యువజన సంఘం నూతన అధ్యక్షులుగా ‘అంకం శ్రీకాంత్ ’
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 24,(తెలంగాణ కెరటం)
దుబ్బాక పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవరర్గాన్ని మంగళవారం పద్మశాలి సమాజ సంఘం అధ్యక్షులు జిందం గాలయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా అంకం శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా బేతి క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శిగా వడిచర్ల వెంకటేష్, సహాయ కార్యదర్శిగా సిరిగాధ మధు, కోశాధికారిగా కారంపూరి భానులు 2026-28 సంవత్సరాలుగా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు అంకం శ్రీకాంత్ మాట్లాడుతూ... పద్మశాలి యువజన సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పద్మశాలిల సమస్యలపై పరిష్కారం కోసం ముందుంటానని తెలిపారు. జియో ట్యాగు సంబంధం లేకుండా చేనేత కార్మికులకు పెన్షన్ అమలు చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన పెన్షన్ అమలు విధానంలో పద్మశాలి సమాజానికి ఎంతో అన్యాయం చేస్తుందని, ప్రతి చేనేత కార్మికునికి చేనేత పెన్షన్ ఇస్తానని ఎన్నికలలో మాట చెప్పి ప్రస్తుత ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని అన్నారు.చేనేతల పైన ప్రభుత్వం చాలా చిన్నచూపు నిర్లక్షం తగదని, రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా బీసీలే ఉన్నారని బీసీలకు అన్ని రాకల ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కల్పించాలని ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. చేనేత వృత్తిని పెంపొందించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు జిందం గాలయ్య, సెక్రటరీ బింగి రమేష్, ఉపాధ్యక్షులు గూడూరి ఎల్లప్ప, జాయింట్ సెక్రెటరీ సాములేటి అర్జున్, క్యాషియర్ కారంపూరి గురు చరణ్, చెరుకు నరేష్ మంతూర్ చంద్రశేఖర్ మరియు పాండి పెద్దలు, పద్మశాలి సమాజం సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.