🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 7:55 pm Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో ప్రారంభించిన మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు

News Image
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో ప్రారంభించిన మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు 

తెలంగాణ కెరటం కామారెడ్డి, నవంబర్ 24, 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎల్లంపేట్ గ్రామంలో లోయపల్లి నర్సింగ్ రావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మరియు మొహమ్మద్ షాబీర్ అలీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంమోహన్,మాచారెడ్డి మాజీ pacs చైర్మన్ స్వామి  గౌడ్,స్థానిక సర్పంచ్ అంజమ్మ-లక్ష్మీరాజాం,డీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రు నాయక్,మాచారెడ్డి సర్పంచిలా ఫారం అధక్షలు సంతోష్ రెడ్డి,నడిమి తండా సర్పంచ్ కములు,వెనుకతండా సర్పంచ్ పద్మ-స్వామి నాయక్,బొడ్డగుట్ట సర్పంచ్ సంతోష్,అంకిరెడ్డిపల్లి తండా సర్పంచ్ శ్రీరామ్,గుంటితండా సర్పంచ్ వసంత-శివాలాల్,సెక్రటరీ ఖాజా అలీ,ఆరెపల్లి మాజీ సర్పంచ్ లింగ రెడ్డి,వాడి మాజీ సర్పంచ్ రవి,మాజీ ఎంపీటీసీ మల్లయ్య,ఎడ్డీయ్య,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధక్షలు రాజు నాయక్,ఉపసర్పంచ్ రజిత,వార్డ్ సభ్యులు వికాస్ గౌడ్(సన్నీ),గవ్రవ్వ, లక్ష్మణ్,రాజ్య,లత, అడ్వకేట్ నరేష్,సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.*
Additional News Photo
🏠 Home