🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 8:47 pm Posted by : ELIGETI VAMSHI KRISHSNA

కేంద్ర ప్రభుత్వ సహకారంతో వికలాంగుడికి సైకిల్.. ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పోన్కల్ వాసి

News Image
నిర్మల్ జిల్లా, పోన్కల్ గ్రామానికి చెందిన వికలాంగుడికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక సైకిల్ అందడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు సహాయపడిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా లాంటి దివ్యాంగులకు అండగా నిలుస్తూ, మా ప్రయాణానికి తోడ్పడేలా సైకిల్ అందించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ సైకిల్ నా రోజువారీ ప్రయాణానికి ఎంతో తోడ్పడుతుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎప్పటికీ మర్చిపోలేను” అని ఆనందం వ్యక్తం చేసినట్లు కథనం.

ప్రజల అవసరాలను గుర్తించి దివ్యాంగులకు చేయూతనందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.

🏠 Home