🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 10:07 pm Posted by : TELANGANA KERATAM

సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి సిపిఐ

News Image
సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న జైల్ భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి సిపిఐ 

తెలంగాణ కెరటం కోటగిరి 25 నవంబర్ 

 కోటగిరి మండల కేంద్రంలో పత్రికా సమావేశం నిర్వహించారు  ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఓట్ల చోరీకి సహకరిస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మోడీజీ అధికారులకు వచ్చిన ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని దాని మూలంగా దేశంలో రోజు రోజుకూ నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. మరొపక్క ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు మరియు మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా  బద్లావ్ జరూరి హై - మార్పు అవసరం  కార్యక్రమంలో భాగంగా  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 3 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 'జైల్ భరో'కు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్ పత్రిక సమావేశంలో  సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుబాస్ రాములు సిపిఐ మండల కార్యదర్శి ఏ.విటల్ గౌడ్, సిపిఐ మండల నాయకులు నల్ల.గంగాధర్, నీలి శంకర్, గౌస్,సాయిలు, మక్కవ్వ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home