🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 10:41 pm Posted by : TELANGANA KERATAM

సిద్దుల గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

News Image
సిద్దుల గుట్ట జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ 

 10 లక్షల సిద్దులతో సిద్దుల గుట్టకు సిసి రోడ్డు పనులు పూర్తి

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపిన భక్తులు

 కామారెడ్డి జిల్లా 
ఎల్లారెడ్డి (తెలంగాణ కెరటం)
ప్రతినిధి నవంబర్ 24

తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధుల గుట్ట సిద్దేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన 36వ వార్షికోత్సవ జాతరలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు
గత కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధుల గుట్ట ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు నిర్మిస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని 
ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి అభివృద్ధి పనులను ప్రారంభించారు ఇచ్చిన హామీని నిర్దేశిత సమయంలో నెరవేర్చడంతో గ్రామస్తులు, భక్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి భక్తుల సౌకర్యార్థం సిద్ధుల గుట్ట ఆలయ మెట్లను కూడా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
🏠 Home