🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:02 am Posted by : TELANGANA KERATAM

ఔషాపూర్ విల్లాస్‌లో భారీ చోరీ

News Image
ఔషాపూర్ విల్లాస్‌లో భారీ చోరీ

40 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.1.75 లక్షల నగదు అపహరణ

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 24: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ జగత్‌స్వప్న విల్లాస్‌లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లిన విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు విల్లాలోకి చొరబడి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. వివరాల్లోకి వెళితే.. విల్లాస్‌లోని 18వ నంబర్ విల్లాలో నివాసముంటున్న దివ్యకొలు విజయలక్ష్మి (53) తన మామగారు మరణించడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 9వ తేదీన స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో నవంబర్ 23వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో విల్లా సెక్యూరిటీ గార్డు తనిఖీలు నిర్వహిస్తుండగా, 18వ నంబర్ విల్లా తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకుని పరిశీలించగా, ఇంట్లో భద్రపరిచిన సుమారు 40 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.1,75,000 నగదు కనిపించలేదు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకెళ్లినట్లు గుర్తించారు. అదేవిధంగా అదే విల్లాస్‌లోని 49, 41, 43, 56 నంబర్ల విల్లాల్లో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇళ్లలో లేని సమయాన్ని అదునుగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విల్లాస్‌లోని భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల దృశ్యాలు తదితర ఆధారాల ఆధారంగా దొంగలను గుర్తించే దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Additional News Photo
🏠 Home