🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:04 am Posted by : TELANGANA KERATAM

అయిలాపూర్, మాదాపూర్, పైడిమడుగు ప్యాక్స్ చైర్మన్ ల నియామకం

News Image
అయిలాపూర్, మాదాపూర్, పైడిమడుగు ప్యాక్స్ చైర్మన్ ల నియామకం 

బాధ్యతలు స్వీకరించిన నూతన చైర్మన్లు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) నూతన చైర్మన్ గా శశిందర్ రెడ్డి, మాదాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా చేపూరి కృష్ణారెడ్డి, పైడిమడుగు వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా ఏలేటి మహిపాల్ రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నూతన చైర్మన్లు, తదితర పాలక వర్గ సభ్యులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని నూతన పాలక వర్గాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, తదితర మండల కాంగ్రెస్ నాయకులు, ఆయా సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home