🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:18 am Posted by : TELANGANA KERATAM

గ్రామ అభివృద్ధి పనులపై డీఎల్‌పీఓ క్షేత్రస్థాయి పరిశీలన

News Image
గ్రామ అభివృద్ధి పనులపై డీఎల్‌పీఓ క్షేత్రస్థాయి పరిశీలన

ఇంకుడు గుంతలు, మహిళా భవనం, ఇందిరమ్మ జీవిత బీమా పథకం పనులపై ఆరా

కౌడిపల్లి తెలంగాణ కెరాటం  నవంబర్ 24 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకటాపూర్ ఆర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను డీఎల్‌పీఓ సురేష్ బాబు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఇంకుడు గుంతల పనులు, మహిళా సమైక్య భవనం, గ్రామపంచాయతీ భవనం, సీఎస్‌సీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ జీవిత బీమా పథకం  అమలు, నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగకరమని, వాటిని సక్రమంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. మహిళా సమైక్య భవనాన్ని మహిళా సంఘాల సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడేలా నిర్వహించాలని తెలిపారు. గ్రామపంచాయతీ భవనం, సీఎస్‌సీ కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మి కుమార్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల అభివృద్ధి, సమావేశాలు నిర్వహించుకోవడానికి మహిళా సమైక్య భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా గ్రామంలో అవగాహన కల్పిస్తున్నామని, పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో భరోసానిస్తుందని అన్నారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.ఈ సందర్భంగా డీఎల్‌పీఓ సురేష్ బాబు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home