గిరి ప్రదక్షణ పేరుతో తాజామాజీ ప్రజా ప్రతినిధి స్వార్ధ రాజకీయాలు మానుకోవాలి: నందగిరి సతీష్.
గిరి ప్రదక్షణ పేరుతో తాజామాజీ ప్రజా ప్రతినిధి స్వార్ధ రాజకీయాలు మానుకోవాలి: నందగిరి సతీష్.
రిపోర్టర్ సతీష్ ( తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
కార్తీక పౌర్ణమి సందర్భంగా జగద్గిరిగుట్ట శ్రీవారి మెట్లు ఎక్కి కొండమీదికి చేరుకొని ప్రాంతం అభివృద్ధి చెందాలని, దేవాలయం అభివృద్ధి చెందాలని నందగిరి సతీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసారు..
ఈ సందర్బంగా సతీష్ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్ కొండమీద గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి గిరిప్రదక్షిణ అనే కొత్త నాటకానికి తెర లేపడాన్ని ఖండిస్తున్నామని, పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు దేవాలయానికి మంచి చేసింది ఏది లేదని, భక్తుల సౌకర్యార్థం కనీసం బాత్రూములు కూడా కట్టించలేదని, చుట్టూ పక్కల భూ కబ్జాలను ప్రోత్సహించి గుడి కమిటీకి, ఈఓ గారికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఇపుడు రాజకీయ పబ్బం గడపడం కోసం గిరిప్రదక్షిణ చేయడం అన్యాయమని, కచ్చితంగా రాబోయే రోజుల్లో వారి అక్రమ చిట్టా ప్రజల ముందు బయటపెట్టి నిలదీస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, భాజపా నాయకులు మాదవులు, కార్మిక నాయకులు దుర్గాప్రసాద్, బాలాజీ, లానా, వెంకట్, ప్రశాంత్, నరేష్, బబ్లు, అనిల్, ప్రవీణ్ సాహు, మణి, హరీష్, రాజు, కిరణ్, రాకేష్, నరేందర్, శ్రీకాంత్, రాము, సత్యం, శశిధర్, రామ్, వేణు, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.