🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:29 am Posted by : TELANGANA KERATAM

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

News Image
తెలంగాణ కెరటం
సూర్యాపేట జిల్లా  మునగాల . నవంబర్ 24:
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఘనంగా అన్నదాన (ప్రసాద వితరణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home