🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 8:15 am Posted by : TELANGANA KERATAM

రామప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం

News Image
ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24: 
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు.కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దీపాల వెలుగులతో రామప్ప ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా..భక్తుల సందడి నెలకొంది. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివభక్తులు రామప్ప దేవాలయానికి తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజలు,అభిషేక కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.ఆలయ ప్రాంగణంలో మహిళలు వెలిగించిన కార్తీక దీపాలతో భక్తి వాతావరణం నెలకొంది. భక్తుల శివనామస్మరణ, హరహర మహాదేవ,శంభో శంకర నినాదాలతో రామప్ప ఆలయం మారుమోగింది.కార్తీక మాసంలో శివారాధన, దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కుటుంబ సమేతంగా రామప్ప దేవాలయానికి చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించు కొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించడం భక్తులకు విశేష అనుభూతిని కలిగించింది.చారిత్రక కట్టడం ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తులతో కళకళలాడడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి,సంప్రదాయం,శిల్ప కళా వైభవం కలగలిసిన కార్తీక దీపోత్సవం రామప్పలో వైభవంగా
సాగింది.
Additional News Photo
🏠 Home