గ్రామ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని పరిమండల్ గ్రామ సర్పంచ్ జక్కుల లయశ్రీ–మల్లేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ పెద్ద గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి జీవిత బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీను, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.