🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 2:42 pm Posted by : TELANGANA KERATAM

ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్ కల్పించవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదు!

News Image

కోర్టు తీర్పు పేరుతో ముదిరాజుల జీవితాలతో రాజకీయ ఆటలా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చిన్నకోడూర్, నవంబర్ 25: తెలంగాణ కెరటం ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్ కల్పించవద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, కేవలం రిజర్వేషన్ శాతాల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైనే జీవో 15 విషయంలో తీర్పు వెలువడిందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. కోర్టు తీర్పుల పేరుతో ముదిరాజుల బీసీ-ఏ రిజర్వేషన్ అంశాన్ని పక్కదారి పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజుల భవిష్యత్తుతో ఆటలాడటం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరిచి ముదిరాజులకు బీసీ-ఏ రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా కాలయాపన చేయడం ముదిరాజ్ సమాజాన్ని మోసం చేయడమేనని విమర్శించారు.జీవో 15పై హైకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకోవద్దని, ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తీర్పులో లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ శాతాలను మార్చకుండా కూడా చట్టబద్ధమైన మార్గాల్లో వర్గీకరణ అంశాన్ని పరిశీలించే అవకాశాలను ప్రభుత్వం, బీసీ కమిషన్ అధ్యయనం చేయాలని సూచించారు. సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన న్యాయపరమైన మార్గాలను అనుసరించాలని అన్నారు. జీవో కు సంబంధించిన అంశాలు, కోర్టు పరిశీలనలపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.ఉచిత చేపపిల్లల పంపిణీ చేయలేని ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం ముదిరాజుల సమస్య కేవలం బీసీ-ఏ రిజర్వేషన్‌కే పరిమితం కాదని, మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ప్రతి సంవత్సరం చెరువులు, కుంటల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసి మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోతోందని విమర్శించారు. చేపపిల్లల పంపిణీలో జాప్యం, నిధుల కొరత, అమలులో లోపాల కారణంగా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో కేసీఆర్, హరీష్ రావులు ఉచితంగా చేపపిల్లలు అందించి మత్స్యకారులను ఆడుకున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీని పారదర్శకంగా, సకాలంలో చేపట్టాలని, అవసరమైన నిధులను నేరుగా మత్స్యకార సహకార సంఘాల బ్యాంకు ఖాతాలకు మత్స్యశాఖ ద్వారా అందించి సంఘాల భాగస్వామ్యంతో పంపిణీ చేపట్టాలని కోరారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధానాలను విడనాడి, కొత్త మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటుకు ఎలాంటి అనవసర ఆంక్షలు లేకుండా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం, బీసీ కమిషన్ సమాధానం చెప్పాలి ముదిరాజుల బీసీ-ఏ రిజర్వేషన్ అమలుపై ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? సంబంధిత ఉపసంఘం, మంత్రివర్గ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనుభవపూర్వక ఆధారాలు, అధ్యయన నివేదికలను ఎందుకు పరిశీలించడం లేదు? రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం ఎప్పుడు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటిస్తుంది? అనే ప్రశ్నలకు ముఖ్యమంత్రి, బీసీ కమిషన్, సంబంధిత ఉపసంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ముదిరాజుల హక్కులు, మత్స్యకారుల జీవనోపాధి, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముదిరాజుల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, తమ న్యాయమైన హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ముదిరాజులు తలుచుకుంటే ప్రభుత్వాల రాజకీయ భవిష్యత్తును మార్చగలరని, తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకులు తమ హక్కులను విస్మరిస్తే రాజకీయంగా తగిన సమాధానం చెబుతారని జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ స్పష్టం చేశారు.ఇట్టి కార్యక్రమంలో చెరుకు నారాయణ , గుడిపల్లి వికాస్, రాగిరి చెందు, పోయిల తిరుపతి, దొంతురబోయిన లింగం, చామంతుల రాజు, రాజేశం, బిక్షపతి తదితరులు ఉన్నారు.

🏠 Home