🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 5:42 pm Posted by : Kancharala Shivakumar

ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి -దుబ్బాక పురపాలిక కమిషనర్ ఏ.మహేష్ కుమార్

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకొని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ ఏ.మహేష్ కుమార్ అన్నారు. బుధవారం పురపాలికలోని ధర్మాజీపేట 7, 8, 9, లచ్చపేట 10, 11వ వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ బీమా దరఖాస్తుల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని పేరున బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, కుటుంబ సభ్యులను నామినీగా చేర్చుకోవాలని సూచించారు. ఇప్పటివరకు పురపాలికలో 8 వేల కుటుంబాలకు గాను 906 కుటుంబాలు పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట వార్డు కౌన్సిలర్లు శోభారాణి, సాయికుమార్ గౌడ్, వనం రమేష్, బడుగు రాజు, పుర సిబ్బంది తదితరులు ఉన్నారు.
Additional News Photo
🏠 Home