🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 1:25 am Posted by : TELANGANA KERATAM

చేనేత కార్మికులకు, అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయించండి

News Image
మంత్రి అడ్లూరిని కోరిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వయస్సు పైబడటం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.అదేవిధంగా 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులు కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు మంజూరు కాకపోవడంతో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులందరికీ కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఎలాంటి జాప్యం లేకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత కార్మికులు, నిరుపేద వృద్ధులకు పెన్షన్ ఎంతో ఆర్థిక భరోసానిస్తుందని, ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, జగిత్యాల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ గంగాధర్, జగిత్యాల పద్మశాలి సేవా సంఘ కోశాధికారి ప్రభాకర్, కార్యదర్శి నరేష్, సందీప్, సిరిపురం నిరంజన్, ఆడవాల శ్రీనివాస్, ఆడేపు సత్యం, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

🏠 Home