🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 1:38 am Posted by : TELANGANA KERATAM

పదవీ విరమణ కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి

News Image

ఉద్యోగులకు అదే రోజు అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించాలి టిజి యుఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : పదవీ విరమణ కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, ఉద్యోగులకు అదే రోజు అన్ని ఆర్థిక ప్రయోజనాలు అందించాలని టిజి యుఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు అన్నారు. కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రాజేంద్ర పదవీ విరమణ సందర్భంగా బుధవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టి.జి.యు.ఎస్. జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు పాల్గొని, రాజేంద్ర అందించిన విద్యాసేవలను కొనియాడారు.ఈ సందర్భంగా నునావత్ రాజు మాట్లాడుతూ, సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, పదవీ విరమణ రోజే పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర అన్ని ఆర్థిక ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు గౌరవప్రదమైన వీడ్కోలు, ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర పదవీ విరమణ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేషం, బట్టు హరికిషన్, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, డాక్టర్ రవికుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అంజమ్మ, అందె శివప్రసాద్, డి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, వెంకటేశ్వర్ రావు, పండిత్ గంగా కిషన్, అంజయ్య, రహూఫ్, వ్యాఖ్యాత తిరుకోవెల శ్రీనివాసా స్వామి, సి.ఆర్.పి. గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home