🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 2:13 am Posted by : TELANGANA KERATAM

దెబ్బతిన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలి

News Image
బీజేవైయం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి
 తెలంగాణ కెరటం జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం నుండి కార్గిల్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రహదారి పలుచోట్ల పగుళ్లు ఏర్పడి, రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుట్ల పట్టణ బీజేవైయం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ..ఈ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, రోడ్డు దెబ్బతిన్న కారణంగా ప్రయాణం ఇబ్బందికరంగా మారిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు, రోడ్డు, భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో రహదారిని పరిశీలించి, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని సక్రమంగా బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని కోరారు.
🏠 Home