కల్లూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 25 : కోరుట్ల మండలం కల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని కోరుట్ల ఎంపిడివో వోదెల రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వోదేల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి చిట్నేని లత-రమేష్, ఉప సర్పంచ్ జంగా స్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సరిత, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గోన్నారు.