🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 5:56 am Posted by : Kancharala Shivakumar

దుబ్బాక–బాసర ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి -డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన మచ్చ శ్రీనివాస్

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25:(తెలంగాణ కెరటం)

దుబ్బాక నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా బాసరకు గతంలో నడిచిన ఆర్టీసీ బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని తెలంగాణ వర్కర్స్ యూనియన్ దుబ్బాక ఆర్టీసీ డిపో గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు దుబ్బాక ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.గతంలో దుబ్బాక డిపో నుంచి బాసరకు నడిచిన బస్సు సర్వీసు ద్వారా ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, భక్తులు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించేవారని తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వీసును నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా విద్యార్థులు విద్యాభ్యాసం కోసం, వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం, భక్తులు బాసర పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఇతర మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చులు పెరిగి ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని వివరించారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దుబ్బాక–కామారెడ్డి–నిజామాబాద్–బాసర బస్సు సర్వీసును ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో తిరిగి ప్రారంభించాలని డిపో మేనేజర్‌ను కోరారు. ఈ సర్వీసు పునరుద్ధరణతో దుబ్బాక ప్రాంతంలోని వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటగిరి తండా సర్పంచ్ రంజా నాయక్, కో-ఆపరేటివ్ డైరెక్టర్ వనం అశోక్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ యువజన అధ్యక్షుడు కడవెరుగు గోపి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home