ధర్మాజీపేటలో నూతన గృహ ప్రవేశ వేడుకకు హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో 08వ వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ గౌడ్ కుటుంబ సభ్యులైన పెద్దోళ్ల వెంకట్ నర్సింహ గౌడ్ – పద్మ దంపతుల నూతన గృహ ప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరై నూతన గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్ నర్సింహ గౌడ్ – పద్మ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.