🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 6:06 am Posted by : Kancharala Shivakumar

దుబ్బాక–సిద్దిపేట మధ్య షటిల్ బస్సు సర్వీసు ప్రారంభించాలి -రాత్రి హాల్ట్ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలి

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)

దుబ్బాక నుంచి సిద్దిపేటకు ధర్మాజీపేట మీదుగా షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించాలని, గతంలో అందుబాటులో ఉన్న రాత్రి హాల్ట్ బస్సు సర్వీసును తిరిగి పునఃప్రారంభించాలని కోరుతూ ధర్మాజీపేట స్థానిక కౌన్సిలర్లు మెరుపుల సాయి కుమార్ గౌడ్, గోవిందుగారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి టీజీఎస్‌ఆర్టీసీ దుబ్బాక డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ధర్మాజీపేట మీదుగా దుబ్బాక–సిద్దిపేట మధ్య సరైన బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని షటిల్ బస్సు సర్వీసును ప్రారంభించాలని కోరారు. అలాగే గతంలో నడిచిన రాత్రి హాల్ట్ బస్సు సర్వీసును తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.వినతిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి, ప్రయాణికుల సమస్యలను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్లు వెల్లడించారు.
Additional News Photo
🏠 Home