🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 6:24 am Posted by : Kancharala Shivakumar

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా – ఇందిరమ్మ కుటుంబ బీమా.-అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్.

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 25,(తెలంగాణ కెరటం)
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం అభినందనీయమన్నారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా సొమ్ము అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని పేర్కొన్నారు. కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి బీమా కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించారని తెలిపారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదించే వారు ఉంటే బీమా పొందే వ్యక్తిని కుటుంబ సభ్యులే ఎంపిక చేసుకోవచ్చన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ నంబర్, నామినీల వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ సంకల్పంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పాతూరి వెంకటస్వామి గౌడ్, నీల ప్రభాకర్ కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ కుమార్, మాజీ ఎంపిటిసి పాతూరి శ్రీనివాస గౌడ్, పంచాయతీ సెక్రెటరీ గణేష్, ఆశ వర్కర్ కవిత, అంగన్వాడి టీచర్ వెంకటలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొమ్మరపు ఎల్లం యాదవ్, కూడా వెళ్లి డైరెక్టర్ వేల్పుల యాదగిరి ముదిరాజ్, వార్డు మెంబర్లు గోద శృతి స్వామి, బోడోల్లా అంజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలుపుల బాలమల్లు, వేల్పుల కనకరాజు, తాటికొండ మల్లారెడ్డి మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home