🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 6:47 am Posted by : TELANGANA KERATAM

సర్పన్‌పల్లిలో దళితులు, మహిళలపై దాడి చేసిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలి!

News Image
సర్పన్‌పల్లిలో దళితులు, మహిళలపై దాడి చేసిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలి!

40 రోజులు గడుస్తున్నా నిందితుల అరెస్టులో జాప్యం ఎందుకు?

బాధితులకు న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాల ధర్నా!

వికారాబాద్, నవంబర్ 25:

వి వెంకటేష్ చారి తెలంగాణ కెరటం న్యూస్

వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్‌పల్లి గ్రామంలో దళితులు, మహిళలు, రైతులపై దాడులకు పాల్పడిన 15 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్పన్‌పల్లి గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా దళితులు, మహిళలు, రైతులపై దాడులు జరిగాయని, ఈ ఘటనపై సుమారు 40 రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులపై కేసులు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. కేసులు నమోదై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఫిర్యాదుదారులపైనే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు. డబ్బున్న వ్యక్తులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వికారాబాద్ డీఎస్పీ, సీఐలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దళితులు, మహిళలు, రైతులపై దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. వెంటనే 15 మంది నిందితులను అరెస్టు చేయకపోతే, అరెస్టులు జరిగే వరకు నిరవధిక ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపడతామని హ
🏠 Home