సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన నిధులతో చర్చి రోడ్డు సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన “బిల్లా యాదగిరి”సర్పంచ్ వేలేరు మేజర్ గ్రామపంచాయతీ, ఈ సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఏ ఎం సి సభ్యులు, సంపత్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేలేరు మండల కేంద్రంలో బైరి రవి ఇంటి నుండి చర్చి హస్టల్ వరకు దాదాపు 350 మీటర్ల సిసి రోడ్డు సరిగా లేనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారికి తెలుపగానే ఎమ్మెల్యే తక్షణమే స్పందించి ప్రత్యేక నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో వేలేరు గ్రామ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సర్పంచ్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిపి కార్యదర్శి విజయ , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేందర్ , వార్డు సభ్యులు చైతన్య, సునీల్, చర్చి ఫాదర్ కిరణ్ , ఆత్మ సభ్యులు చేంద్రమొగిలి, పెద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన సంఘ నాయకులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు