అచ్చంపేటలో హడావిడిగా రోడ్డు మరమ్మత్తు పనులు.
అచ్చంపేటలో హడావిడిగా రోడ్డు మరమ్మత్తు పనులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి =
(నవంబర్ 25):
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అచ్చంపేట పట్టణంలో పర్యటించనున్న సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న గుంతలను ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా హడావిడిగా మరమ్మతులు చేపడుతున్నారు. అటవి శాఖ చెక్ పోస్ట్ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు గుంతలు ఏర్పడి అద్వానంగా తయారైంది. ఈ రోడ్డులో పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే రోడ్డు మరమ్మత్తు పనులు నోచుకోకపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.