🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 4:33 pm Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ

News Image
రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ*.

 సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కులు కల్పించింది. కులం, మతం, ప్రాంతం, భాష అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం స్పష్టం చేసింది. అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, కార్మికులు, రైతుల హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పించింది.
అయితే నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలు రాజ్యాంగంలోని ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ స్ఫూర్తిపై ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే గొంతుకలను గౌరవించడం, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడటం, రాష్ట్రాల హక్కులను గౌరవించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. కానీ ఈ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామిక శక్తులు, ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
మతం పేరుతో ప్రజల మధ్య విభజనలు పెరగకుండా చూడాలి. మైనారిటీల హక్కులు, దళితులపై దాడుల నివారణ, మహిళల భద్రత, భావప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై ప్రభావం చూపే విధానాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.రాజ్యాంగాన్ని కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా దాని ఆశయాలను పాలనలో అమలు చేయాలి. రాజ్యాంగంలోని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం అనే మూల సూత్రాలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యని,
ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను గౌరవించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం – సామాజిక న్యాయం కోసం పోరాడుదాం. అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా సమితి సభ్యులు గుర్రపు కురుమయ్య, పెంట్లవెల్లి మండల సహాయ కార్యదర్శి నిరంజన్ నాయుడు కొల్లాపూర్ మండల నాయకులు యూసుఫ్ జంగం శివుడు, చందు, శంకర్, చాపల శేఖర్, వెంకటస్వామి, తిరుపతయ్య, కాజమైనదిన్ తదితరులు పాల్గొన్నారు
Additional News Photo
🏠 Home