🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 4:37 pm Posted by : TELANGANA KERATAM

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కొండగట్టులో కలెక్టర్, ఎస్పీ తనిఖీ

News Image
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు - కొండగట్టులో కలెక్టర్, ఎస్పీ తనిఖీ

కొండగట్టు (మల్యాల మండలం, జగిత్యాల) - ప్రతినిధి బి. రఘు:

 ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కొండగట్టు, జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హెలికాప్టర్ ల్యాండింగ్, భద్రత, రహదారి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కొండగట్టు ఆలయం, అతిథిగృహం, సమావేశ ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.గవర్నర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, భోజన పరిసర ప్రాంతాలను కూడా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రత విషయంలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గవర్నర్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏర్పాట్లలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే సరిదిద్దాలని, సమయానికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
🏠 Home