🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 4:51 pm Posted by : ELIGETI VAMSHI KRISHSNA

108, 102 అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రోగ్రాం మేనేజర్

News Image

📌  అత్యవసర వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో ప్రోగ్రాం మేనేజర్ సంపత్ కుమార్ నిర్మల్ జిల్లాలోని 108, 102 అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ లింగచారి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్సులను పరిశుభ్రంగా ఉంచుతూ అవసరమైన మందులు, పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో 108 సిబ్బంది రాజన్న, దీపక్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

  

🏠 Home