🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 5:04 pm Posted by : TELANGANA KERATAM

మద్దుట్లలో భక్తి పారవశ్యం - వీరబ్రహ్మేంద్ర స్వామి కథ

News Image
మద్దుట్లలో భక్తి పారవశ్యం - వీరబ్రహ్మేంద్ర స్వామి కథ

మద్దుట్ల (మల్యాల మండలం, జగిత్యాల) - ప్రతినిధి బి. రఘు:

 మద్దుట్ల గ్రామం మొత్తం ఒక్కసారిగా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. విశ్వబ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర కథను ఎంతో వైభవంగా నిర్వహించారు. స్వామివారి జననం నుండి కందిమల్లాయపల్లెలో తపస్సు, కాలజ్ఞాన రచన వరకు ప్రతి ఘట్టాన్ని కథకులు కళ్లకు కట్టినట్లు చెప్పడంతో భక్తులు మైమరచిపోయారు. ఈ కథా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సంకుర్తి తిరుపతి, గ్రామ పెద్దలు, యువకులతో పాటు ఆడపడుచులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తితో విన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు రావడంతో వేదిక భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి చిత్రపటంతో, పూల మాలలతో వేదిక కళకళలాడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంకుర్తి తిరుపతి తిరుపతి మాట్లాడుతూ ఇలాంటి గొప్ప మహాత్ముల కథలను చెప్పడం ద్వారా పిల్లలలో ఎంతో మార్పు తీసుకురావచ్చని, వారిలో సంస్కారం, భక్తి, సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుందని చెప్పారు. గ్రామంలో ఐక్యత, శాంతి వెల్లివిరియడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని విశ్వబ్రాహ్మణ కుల సంఘం సభ్యులు తెలిపారు
🏠 Home