🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 5:13 pm Posted by : TELANGANA KERATAM

బోధించు! సమీకరించు!! పోరాడు

News Image
బోధించు! సమీకరించు!! పోరాడు!!!

మాలల హక్కుల సాధన సమితి – తెలంగాణ రాష్ట్ర కమిటీ

మెదక్‌లో ఘనంగా భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలు,
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన మాలల హక్కుల సాధన సమితి నాయకులు
ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని టంగో భవన్‌లో మాలల హక్కుల సాధన సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పోతరాజు కుమార్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి స్వామి, గరిజల స్వామి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు, దళిత రత్న అవార్డు గ్రహీత బొమ్మల మైసయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
1. బొమ్మల మైసయ్య – మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు.
2. చింతకింది బాల ఎల్లం – తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.
3. పోతరాజు కుమార్ – మెదక్ జిల్లా అధ్యక్షుడు.
4. పాలేటి స్వామి – మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు.
5. గరిజల స్వామి – మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు.
6. దోసల కార్తీక్ – రామాయంపేట మండల అధ్యక్షుడు.
7. నర్సగారి నర్సింలు – వెల్దుర్తి మండల అధ్యక్షుడు.
8. గరిజల సాయికుమార్ – నాయకులు.
అలాగే మాలల హక్కుల సాధన సమితి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
జై భీమ్! జై మాల!! జై జై మాల!!!
జై భారత రాజ్యాంగం!!!
ఇట్లు,
మాలల హక్కుల సాధన సమితి – తెలంగాణ రాష్ట్ర కమిటీ
🏠 Home