బిజెపి ఎన్ని కుట్రలు చేసిన రాజ్యాంగాన్ని మార్చలేరు.
బిజెపి ఎన్ని కుట్రలు చేసిన రాజ్యాంగాన్ని మార్చలేరు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ ప్రభుత్వ విధానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ల విమర్శ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఏం. బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, భావప్రకటనా స్వేచ్ఛ వంటి విలువలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సవాలుగామారుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, పాలనా విధానాలు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఆందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలు లేకుండా సమాన హక్కులను కల్పించింది. కానీ మతం ఆధారంగా సమాజంలో విభజనలను పెంచే రాజకీయ ధోరణులు, ప్రజల మధ్య అసమానతలకు దారితీసే విధానాలు, ప్రభుత్వ సంస్థల స్వతంత్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని కాపాడాల్సిన ప్రభుత్వాలు మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మేలు చేయదని, ప్రజల ఐక్యతను దెబ్బతీసే రాజకీయాలకు బదులుగా సామాజిక ఐక్యత, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేయాలని అన్నారు.
కార్మికుల హక్కులు, రైతుల ప్రయోజనాలు, నిరుద్యోగ యువత సమస్యలు, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, పేదల సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలపై భారాలు పెంచే విధానాలను అవలంబించడం రాజ్యాంగంలోని సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యాలకు విరుద్ధమని విమర్శించారు.
రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కులను గౌరవించాలని,ప్రభుత్వ విధానాలను విమర్శించే ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల గొంతుకలను ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో చూడాలని అన్నారు.రాజ్యాంగ దినోత్సవం కేవలం ఉత్సవాలకు, ప్రసంగాలకు పరిమితం కాకుండా రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో అమలు చేసే దిశగా పాలకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడటం అంటే ప్రజల హక్కులను కాపాడటం, అణగారిన వర్గాలకు న్యాయం చేయడం, కార్మికులు, రైతులు, పేదలు, మహిళలు, యువతకు సమాన అవకాశాలు కల్పించడం అని పేర్కొన్నారు.రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, సామాజిక ఉద్యమకారులు, కార్మికులు, రైతులు, యువత ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ రాజ్యాంగ పీటికను చదివి అందరి చేత ప్రమాణం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జి, కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, జిల్లా సమితి సభ్యులు మర్యాద వెంకటయ్య, రవీందర్, బండి లక్ష్మీపతి, డిహెచ్పిఎస్ రాష్ట్ర సమితి సభ్యులు వంకేశ్వరం శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు శివకృష్ణ, పట్టణ నాయకులు కొత్త రామస్వామి, బొగురమ్మ, వెంకటమ్మ,శేఖర్, గోపి చారి, హుస్సేన్, అంజి, సంతోష్, జగన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.