రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 26:
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిధిలోని భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ శ్రేణులతో కలిసి గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటం, రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ ర్యాలీ ద్వారా పిలుపునిచ్చారు.