🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 7:12 pm Posted by : TELANGANA KERATAM

అనుమతులు లేకుండా బోర్లు వేయొద్దు

News Image
అనుమతులు లేకుండా బోర్లు వేయొద్దు

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26

నివాస గృహాలు, వ్యవసాయం మినహా ఇతర కమర్షియల్, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల కోసం బోర్ వెల్  అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని, అలాంటి వాటికి అనుమతి లేకుండా బోర్లు వేయొద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో బోర్ వెల్ అనుమతులు, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమర్షియల్, పరిశ్రమలు,  వాణిజ్య సముదాయాలకు బోర్ వెల్ అనుమతులు భూగర్భ జల శాఖ నుండి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నియమాలను అన్ని శాఖల అధికారులు పాటించాలని సూచించారు. రిగ్ వాహనాల యజమానులు అనుమతులు లేకుండా కొత్తగా బోర్ వెల్ వెయొద్దన్నారు. బల్క్ వాటర్ సప్లయర్లు అనుమతులు లేకుండా భూగర్భ జలాలను వెలికి తీయొద్దన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం జరిమానా విధించడంతోపాటు సీజ్ చేసే అధికారం అధికారులకు ఉందన్నారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు తోడ్పడాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, జడ్పీ సీఈవో శేషాద్రి, డి ఆర్ డి ఓ మేన శ్రీను, జిల్లా భూగర్భ జల అధికారి శైల శ్రీ మల్లికా దేవి, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ రవీందర్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ రవళి, పలువురు జిల్లాస్థాయి అధికారులతో పాటు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, రిగ్ వాహనాల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home