రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది
డీసీసీ మైనారిటీ చైర్మన్ ఎం.ఏ నయీమ్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని జగిత్యాల డీసీసీ మైనారిటీ చైర్మన్ ఎం.ఏ నయీమ్ అన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ ఎం.ఏ నయీమ్ ఆధ్వర్యంలో గురువారం కోరుట్ల పట్టణంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 02,వ వార్డు కౌన్సిలర్ హుమేరా వాసీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముజీబుర్ రహమాన్, ముస్బిత్, మొహమ్మద్ రజీ, మొహమ్మద్ రీహాన్, అశోక్, సూఫియాన్, ముస్తఖీమ్, జీబ్రాన్ తదితరులు పాల్గొన్నారు.