🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 7:53 pm Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి..

News Image
రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి..
ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత..
సంవిధాన్ రక్షక్ ర్యాలీలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్ 

పఠాన్ చెరు నుండి వందకు పైగా కార్లతో హైదరాబాద్ కు భారీ ర్యాలీ..
పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు..
భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి పౌరుడికి అందాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ లిబర్టీ చౌరస్తా నుండి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ ర్యాలీకి పటాన్ చెరు నియోజకవర్గం నుంచి వందకు పైగా కార్లతో పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లి నీలం మధు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇంచార్జ్ బిఎం సందీప్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడంతో పాటు ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. భావితరాలకు రాజ్యాంగ ప్రాధాన్యతను తెలియజేస్తూ సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు..
🏠 Home