🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:28 pm Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

News Image
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హన్మకొండ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 26

హైదరాబాద్: భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ర్యాలీ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలని నాగరాజు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home