🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:30 pm Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ కార్యకర్తల ప్రతిజ్ఞ

News Image
రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ కార్యకర్తల ప్రతిజ్ఞ

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడి

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప  కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు, రైతులు, కార్మికులు, విద్యార్థుల హక్కులకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అనే ముద్రలు వేస్తూ వారి గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు.రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతి పౌరుడికి అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఇకపై ‘మోదీ హటావో.. దేశ్ బచావో’ నినాదంతో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.
సీపీఎం మండల కార్యదర్శి ఎన్. సబిత మాట్లాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన గొప్ప ఆయుధం భారత రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ శాఖ కార్యదర్శి బి. శ్రీనివాస్, కేఎల్ మహేంద్ర నగర్ కాలనీ అధ్యక్షుడు ఎన్. రాములు గౌడ్, అన్నోజిగూడ శాఖ కార్యదర్శి లొట్టి సరిత, మండల నాయకులు బి. రాజు గౌడ్, పి. ఎల్లయ్య, ప్రమీల, భిక్షపతి, శివ, ఎండీ మౌలానా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home