ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి
వెల్దుర్తి: తెలంగాణ కెరటం ప్రతినిధి: 26
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వస్తాల్‌పూర్ గ్రామంలో ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు.గ్రామానికి చెందిన గొల్ల నాగరాజు (38) 25న మధ్యాహ్నం 1 గంటకు తన ట్రాక్టర్‌పై వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు.26న ఉదయం 8 గంటలకు హల్దీ డ్యామ్ కాలువలో మన్నె కిషన్ పొలం సమీపంలో ట్రాక్టర్ కింద నాగరాజు పడి ఉన్నట్లు బంధువులు గుర్తించారు. అతన్ని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.భార్య గొల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.