🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:54 pm Posted by : TELANGANA KERATAM

ధాన్యం కొనుగోలును సజావుగా నిర్వహించాలి

News Image
ధాన్యం కొనుగోలును సజావుగా నిర్వహించాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 26

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్  ఎన్. రవి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులు, సంబంధిత కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నడికూడ మండలం ముస్త్యాలపల్లి లో భూ రీసర్వే పరిశీలన నడికూడ మండలం ముస్త్యాలపల్లి లో భూ రీసర్వే ప్రక్రియ కొనసాగుతుండగా అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  సర్వేయర్లు రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ముస్త్యాలపల్లి  గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, భూములు కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, పరకాల ఆర్డీవో డీఎస్. వెంకన్న, పరకాల, నడికూడ, శాయంపేట తహసీల్దార్ విజయలక్ష్మి,రాణి, ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
🏠 Home