ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 26 :
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా .కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల అమృతధారనే ఈ రాజ్యాంగము, ప్రజాస్వామ్యానికి అది పునాది, కులమత భేదాలు దూరం చేయడానికి ఇది ఒక వారధి, కలిసికట్టుగా భారతాన్ని నిర్మించుకోవడానికి మనమందరం ఐక్యతగా ఉండాలని వారు మాట్లాడుతూ జాతీయ సేవా పథకం లోని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు వివరించారు. ఇందులో భాగంగా సీనియర్ అధ్యాపకులు డాక్టర్ మండలోజు నర్సింహస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య విలువలను, పౌరుల హక్కులు మరియు బాధ్యతలను ప్రజలకు తెలియజేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. మనమందరం కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆచరణలో పెడదాం వారిలాగా మనం ఒక గొప్పనైనటువంటి వ్యక్తిగా తయారు కావాలని సూచించారు. న్యాయమనే దీపం వెలిగించి, సమానత్వపు బాటను చూపించి, స్వేచ్ఛా సౌభ్రాతృత్వాల స్ఫూర్తిని నింపినది, మన భారత రాజ్యాంగం మన దేశపు ఆభరణం!ఈ రాజ్యాంగం పట్ల మనమందరము కూడా కట్టిబద్ధులమై వీటిలోని అన్ని అంశాలను మనం పాటించి తెలియని వారికి వీటి యొక్క గొప్పతనము తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కామర్స్ అధ్యాపకులు మస్తాన్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనై రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని మనకు రక్షణగా మనకు అండగా మనల్ని అభివృద్ధి పతంలో నడిపించే అంశాలను రూపొందించారు . స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలి తప్ప చట్ట విరుద్ధంగా వాడకూడదని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పల్లె శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం ఆమోదం: 1949 నవంబర్ 26. రాజ్యాంగం అమలు: 1950 జనవరి 26.రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన సమయం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు కాలం పట్టింది.ఈ రోజును సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. స్వేచ్ఛను పొందుతున్నాము మరియు హక్కులను పొందుతున్నాము కానీ బాధ్యతలను మర్చిపోతున్నారు. అని వివరణ ఇస్తూ విద్యార్థులకు పరీక్షల కాలము ఆసన్నమైనది కాబట్టి గొప్పగా పట్టుదలతో చదివి కళాశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులురహిమాన్ ,జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు ఎస్ శ్రీనివాస్, చిద్రురాల గోవర్ధన్, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.