🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:59 pm Posted by : TELANGANA KERATAM

బాధితుడి పోగొట్టుకున్న నగదును కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి అప్పగింత.

News Image
బాధితుడి పోగొట్టుకున్న నగదును కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి అప్పగింత.
 
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26,

 నవంబర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించి రూ.31,240 నగదును బాధితుడికి అందజేతప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ, సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: బాధితుడి పోగొట్టుకున్న నగదును సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తిరిగి బాధితుడికి అందజేసి హద్నూర్ పోలీసులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళితే.. ఈరోజు (26.11.2026) ఉదయం 11:45 గంటల సమయంలో శంశోద్దిన్‌పూర్ గ్రామానికి చెందిన యాదయ్య హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి, జహీరాబాద్ నుంచి తన గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తుండగా గంగ్వార్ వద్ద దిగే సమయంలో తొందరలో తన వద్ద ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో రూ.31,240 నగదు ఉందని, దానిని తిరిగి ఇప్పించాలని కోరాడు.
వెంటనే స్పందించిన హద్నూర్ ఎస్ఐ సుజిత్ తన సిబ్బంది రవికుమార్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, బాధితుడు ప్రయాణించిన ఆటోను గుర్తించారు. హద్నూర్ గ్రామానికి చెందిన సద్దాం అనే వ్యక్తికి చెందిన ఆటోగా గుర్తించి, వెంటనే ఆటో డ్రైవర్‌ను సంప్రదించి, బ్యాగులో ఉన్న రూ.31,240 నగదును బాధితుడు యాదయ్యకు సురక్షితంగా తిరిగి అప్పగించడం జరిగింది.పోగొట్టుకున్న నగదును అతి తక్కువ సమయంలో గుర్తించి తిరిగి అందించినందుకు బాధితుడు సంతోషం వ్యక్తం చేస్తూ, హద్నూర్ పోలీసుల పనితీరును ప్రశంసించాడు.ప్రజలకు ఎలాంటి ఆపద సమయంలోనైనా డయల్ 112 చేయాలని సూచించడం జరుగుతుంది.
🏠 Home