🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 9:50 pm Posted by : TELANGANA KERATAM

చిన్న మెట్పల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

News Image
చిన్న మెట్పల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : కోరుట్ల మండలం చిన్న మెట్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం ఆద్వర్యంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మౌలిక సూత్రాలను గౌరవిస్తూ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, పౌరుల బాధ్యతలు, దేశ సమగ్రతను కాపాడాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హకీమ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home