26,వ వార్డులో నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
26,వ వార్డులో నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : కోరుట్ల పట్టణంలోని 26,వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు గురువారం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, 26,వ వార్డు కౌన్సిలర్ అన్నం లావణ్య అనిల్ చేతుల మీదుగా మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నం లావణ్య అనిల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ప్రతినెలా పెన్షన్ అందించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక చేయూత లభిస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందాలన్నదే లక్ష్యమని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు..ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మధు, మున్సిపల్ సిబ్బంది జగియోద్దీన్, రాజశేఖర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.