🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 8:44 am Posted by : Kancharala Shivakumar

18వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభోత్సవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి – కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి–నరేందర్

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 26,(తెలంగాణ కెరటం)

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.స్థానిక 18వ వార్డులోని నీలకంఠ భజన మండలిలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు చెందిన అర్హులైన సభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని 18వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి–నరేందర్ కోరారు.

దరఖాస్తుకు కావలసిన పత్రాలు:
1. ఇంటి యజమాని రేషన్ కార్డు.
2. ఆధార్ కార్డు.
3. మొబైల్ నంబర్ (OTP కోసం).
కావున 18వ వార్డులోని అర్హులైన ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇందిరమ్మ బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కౌన్సిలర్ విజ్ఞప్తి చేశారు.కార్యక్రమ వివరాలు:- తేదీ: శుక్రవారం, 27వ తేదీ
- సమయం: ఉదయం 10 గంటలకు
- వేదిక: నీలకంఠ భజన మండలి, 18వ వార్డు, లో నిర్వహించడం జరుగుతుందని కౌన్సిలర్శ్రీ రామ్ సరస్వతి – నరేందర్ వార్డు ప్రజలకు తెలిపారు.
🏠 Home