ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.... ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలను పాటించాలి సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ.
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమమును ప్రారంభించారు.అనంతరం జనరల్ మేనేజర్ గారి కార్యాలయ సిబ్బందితో కలిసి భారత రాజ్యాంగ పీఠిక (ప్రతిజ్ఞ)ను చేయించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హృదయం వంటిది. ప్రతి భారత పౌరుడు అనుసరించాల్సిన ప్రాథమిక విలువలు, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించిన గొప్ప పత్రం ఇది. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ప్రగాఢ పరిజ్ఞానం, దూరదృష్టి, సమానత్వ భావజాలం నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అని అలాగే, రాజ్యాంగం అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సింగరేణి సంస్థలో ప్రతి ఉద్యోగి తమ విధుల్లో పారదర్శకత, నిజాయితీ, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను పాటించడం అత్యంత అవసరం. రాజ్యాంగ స్ఫూర్తిని కార్యరూపంలో పెట్టినప్పుడే సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం మరింత బలపడతాయి అని, ప్రతిఒక్కరూ రాజ్యాంగంలోని హక్కులను కాపాడుకోవడం తోపాటు, తమపై ఉన్న బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు.జి.ఎం జి .ఎల్ .ప్రసాద్, ఎ.ఐ.టి.యు.సి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం జాయింట్ సెక్రెటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పిఓ కార్తీక్ మరియు జనరల్ మేనేజర్ గారి కార్యాలయ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.