🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 1:31 pm Posted by : TELANGANA KERATAM

భర్త వేధింపులు తాళలేక గొంతు నులిమి హత్య చేసిన భార్య

News Image

నిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటం

నందిపేట్ గ్రామంలోని రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలో ఈరోజు (27.11.2026) సాయంత్రం ఒక దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది.

ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం
నందిపేట్ గ్రామం, రాజ్ నగర్ దుబ్బ ఏరియాకు చెందిన గోసం గంగాధర్ 46 సంవత్సరాలు) అనే వ్యక్తిని అతని భార్య గోసం సుమలత (వయస్సు: 41 సంవత్సరాలు) భర్తను హత్య తీయడం జరిగింది
ఘటన జరిగిన తీరు:భర్త గోసం గంగాధర్ నిత్యం పెడుతున్న వేధింపులు, బాధలు భరించలేక విసిగిపోయిన భార్య సుమలత, ఈరోజు సాయంత్రం సుమారు 4:00 గంటల నుండి 5:00 గంటల మధ్య సమయంలో వారి స్వగృహంలోనే గంగాధర్ గొంతు నులిమి హత్య చేసింది.సమాచారం అందుకున్న నందిపేట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు
🏠 Home