🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 4:37 pm Posted by : TELANGANA KERATAM

కల్వర్‌రాల్ కాంప్లెక్స్‌లో హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

News Image
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కా తెలంగాణ కెరటం (ప్రతినిధి) 27 నవంబర్ 
సదాశివనగర్ మండలంలోని కల్వర్‌రాల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రముఖ హిందీ కవి, రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హరివంశ్ రాయ్ బచ్చన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలను, రచనల ద్వారా సమాజానికి అందించిన సందేశాలను వక్తలు గుర్తుచేసుకున్నారు. హిందీ భాషా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, హిందీ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సహేందర్ నాథ్, ముఖ్య సలహాదారు చింతల లింగం, సదాశివనగర్ మండల ప్రధాన కార్యదర్శి శీలం కోటి రమేష్, గాంధారి మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కల్వర్‌రాల్ కాంప్లెక్స్ పరిధిలోని హిందీ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ వేడుకలు హిందీ భాషా సాహిత్యంపై ఉపాధ్యాయుల్లో మరింత ఆసక్తిని, భాషాభిమానాన్ని పెంపొందించేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధారి నగర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు హిందీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మెహర్ ఉన్నిసా, సుగుణ శోభ కవిత, హనుమంతు, మురళీకృష్ణ, బాబు, రాజేందర్ సి ఆర్ పి నందు రావు పాల్గొన్నారు
🏠 Home