యశ్వంత్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వాములకు ఘనంగా అన్నదానం
భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం.. యశ్వంత్ గౌడ్‌కు అయ్యప్ప స్వాముల ఆశీస్సులు
జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించడం అభినందనీయం – రిపోర్టర్ బంటారం బాలరాజు గౌడ్
నందిగామ నవంబర్ 27( తెలంగాణ కెరటం)
నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో తన కుమారుడు **బంటారం యశ్వంత్ గౌడ్ జన్మదినం** సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు రిపోర్టర్ బంటారం బాలరాజు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలు కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, భక్తి భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులతో తమ కుమారుడు యశ్వంత్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వాములకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు.అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించడం ద్వారా స్వామివారి సేవలో భాగస్వాములు కావడం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప గురుస్వాములు యశ్వంత్ గౌడ్‌ను ఆశీర్వదిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు, మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.