🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 4:48 pm Posted by : TELANGANA KERATAM

హనుమకొండలో విచ్చలవిడిగా బెల్లం చాయ్ ఔట్‌లెట్లు!

News Image
బెల్లం పేరుతో రసాయనాల వినియోగం జరుగుతోందా?ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఎక్కడ?నగరంలో పెరుగుతున్న బెల్లం టీ కేంద్రాలు.. పట్టించుకోని అధికారులు!
హన్మకొండ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 27హనుమకొండ నగరంలో బెల్లం చాయ్ పేరుతో కొత్తకొత్త ఔట్‌లెట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అయితే ఈ కేంద్రాల్లో నిజంగానే స్వచ్ఛమైన బెల్లంతో చాయ్ తయారు చేస్తున్నారా? లేక రుచి, రంగు కోసం ఇతర పదార్థాలు, రసాయనాలు కలుపుతున్నారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.నగరంలో రోజురోజుకూ బెల్లం చాయ్ కేంద్రాలు పెరుగుతున్నప్పటికీ, వాటిలో ఉపయోగిస్తున్న బెల్లం నాణ్యత, తయారీ విధానం, పరిశుభ్రతపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది.ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటివరకు ఈ కేంద్రాలపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి నగరంలోని బెల్లం చాయ్ ఔట్‌లెట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించాలి. ఉపయోగిస్తున్న బెల్లం, ఇతర పదార్థాల నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బెల్లం చాయ్ ముసుగులో కల్తీ జరుగుతోందా? ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే తనిఖీలు ఎప్పుడు? అన్న ప్రశ్నలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
🏠 Home